పునరుద్ధరణ ఇంధనాలతో భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

పునరుద్ధరణ ఇంధనాలతో భవిష్యత్తు

Mar 14 2026 7:27 AM | Updated on Mar 14 2026 7:27 AM

రామగిరి(నల్లగొండ) : పునరద్ధరణ ఇంధనాలతో ఉజ్వల భవిష్యత్‌ ఉందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పి.జలపతి అన్నారు. ఎన్జీ కాలేజీలో కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘గ్రీన్‌ ఎనర్జీ రిసోర్సెస్‌ క్లీన్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇన్‌ ఇండియా’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో గ్రీన్‌ మెథడ్స్‌, నానో మెటీరియల్స్‌ పాత్రను వివరించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, పునరుద్ధరణ ఇంధన వనరులపై దృష్టి సారించాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పద్మావతి మాట్లాడుతూ కంప్యూటర్‌ కెమిస్ట్రీ ద్వారా ఎనర్జీ మెటీరియల్స్‌ మోడలింగ్‌ ప్రాధాన్యతను వివరించారు. పారిశ్రామికవేత్త నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమలో వ్యర్థాల నిర్వహణ, గ్రీన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఆవశ్యకతను వివరించారు. అనంతరం పరిశోధన పత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఎస్‌.ఉపేందర్‌, ప్రోగ్రాం కన్వీనర్‌ శ్రీనివాసులు, వైస్‌ ప్రిన్సిపాల్‌ పరంగి రవికుమార్‌, వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్‌, సీఈఓ మునిస్వామి, బత్తిని నాగరాజు, అధ్యాపకులు ఏ.మల్లేశం, శ్రీధర్‌, కోటయ్య, జోత్న్స తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement