అగ్నివీర్‌ వాయు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

అగ్నివీర్‌ వాయు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Mar 14 2026 7:27 AM | Updated on Mar 14 2026 7:27 AM

నల్లగొండ టూటౌన్‌ : ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ వాయు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ఈనెల 8 నుంచి 18 వరకు సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో నిర్వహిస్తున్నట్లు నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ బి.శరత్‌చంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల యువత http:// agnipathvayu.cdac.in ద్వారా వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కళాకారులుగా విడిపోలేదు

మిర్యాలగూడ : తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములుగా విడిపోయాయే తప్ప.. కళాకారులగా విడిపోలేదని.. నాటకరంగంలో తామంగా ఒకే కుటుంబమని రాష్ట్ర కళాకారుల రంగస్థల సమాఖ్య ఉపాధ్యక్షుడు దరుమూరి వెంకటేశ్వర్లు అన్నారు. మిర్యాలగూడలోని మినీ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య నాటక, సాంఘిక నాటిక పోటీలు శుక్రవారం కొనసాగాయి. ఐదు ఈ పోటీలను పారిశ్రామికవేత్త పొలిశెట్టి ధనుంజయతో కలిసి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఇక్కడ ప్రదర్శిస్తున్న నాటికలు యువతరాన్ని మేల్కొలిపే విధంగా ఉన్నాయని కితాబిచ్చారు. ‘మోహిని భస్మాసుర’ అనే పద్య నాటకాన్ని అక్కినేని సాంస్కృతిక సమాజం విజయనగరం, ‘గేమ్‌’ అనే సాంఘిక నాటికను సిరిమువ్వ కల్చరల్‌ హైదరాబాద్‌, ‘అమ్మ చెక్కిన బొమ్మ’ సాంఘిక నాటికను గోవాడ క్రియేషన్స్‌ హైదరాబాద్‌ వారు ప్రదర్శించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ల రామచంద్రరావు, అధ్యక్షుడు రామవతారం, కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, వెంకటలక్ష్మీనారాయణశర్మ, సాయిలు, సత్యనారాయణచారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శైలజ, సరస్వతి, ఉపేందర్‌, బాబురావు, వీరప్రతాప్‌, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement