కట్టెల పొయ్యిపై వంటకాలు..
మిర్యాలగూడ : ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీడీఓలు గ్రామాల వారీగా ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందినవారి జాబితాను రూపొందించి ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామసభలో చదివి వినిపించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయా సభలో చర్చించాలన్నారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వాణిజ్య పరమైన సిలిండర్లకు మాత్రమే కొరత ఉందని, ప్రజలు అపోహాలు నమ్మవద్దని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లను అక్రమంగా కమర్షియల్‌కు వాడిన 16 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేసి మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. పేదలకు విద్యా, వైద్యం అందించేందుకు సహకారం అందించాలని కలెక్టర్‌ను కోరారు. యూరియాను మండలాల వారీగా కాకుండా పీఏసీఎస్‌ల వారీగా తమకు కేటాయించాలని, వైటీపీఎస్‌కు సంబంధించి ీసీఎఎస్‌ఆర్ నిధులను అభివృద్ధి పనులకు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుధాబాలకృష్ణ, వైస్ ఛైర్మన్ గుడిపాటి శిరీషనవీన్, సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అదికారులు, నాయకులు పాల్గొన్నారు.
వేసవిలో నీటి ఎద్దడి రానివ్వం
మిర్యాలగూడ : వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సీఎస్ రామకృష్ణరావు నిర్వహించిన వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ వేసవిలో తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జూన్ చివరి వరకు ప్రజలకు ఆయా రిజర్వాయర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన నీటిని సిద్ధంగా ఉంచాలన్నారు. ఉదయ సముద్రం కింద సాగువుతున్న పంటలకు ఎప్పటివరకు సాగునీరు అవసరం ఉందో క్షేత్రస్థాయిలో ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నల్లగొండలోని ఓ రెస్టారెంట్‌లో కట్టెలపొయ్యిపై వంట చేయిస్తున్న నిర్వాహకులు, (ఇన్‌సెట్‌లో) ఓ రెస్టారెంట్‌లో మూతపడిన గ్యాస్‌పొయ్యి
నల్లగొండ : వంట గ్యాస్ కొరత హోటల్ రంగాన్ని కుదిపేస్తోంది. కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్ల మూతపడుతున్నాయి. వీధి వ్యాపారులు రోడ్డున పడుతున్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. కొందరు హోటళ్ల నిర్వాహకులు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. దీంతో కట్టెలకు ధర పెరిగింది. మరోవైపు అధికారులు హోటళ్లపై దాడులు చేసి వారి వద్ద డొమెస్టిక్ సిలిండర్లు ఉంటే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. గ్యాస్ కొరత లేదని చెబు తున్న అధికారులు జిల్లాలోని 34 ఏజెన్సీల్లో ఎక్కడ ఎంత స్టాక్ ఉందో చెప్పలేకపోతున్నారు. ఇక గ్యాస్ దొరకదన్న భయాందోళనలో ప్రజలు బుకింగ్ కోసం ఎగబడుతున్నారు.
హోటల్ బంద్ చేసినట్లు బోర్డు ఏర్పాటు
నల్లగొండ జిల్లా కేంద్రం నడిబొడ్డున గడియారం సెంటర్‌లో ఉన్న వెంటరమణ టిఫిన్ సెంటర్‌ను గ్యాస్ కొరతతో మూసి వేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించి బోర్డు పెట్టింది. పక్కన ఉన్న వెంకటరమణ బార్ అండ్ రెస్టారెంట్‌లో వంటలను కట్టెలతో చేస్తున్నారు.
డొమెస్టిక్ సిలిండర్లపై ఉక్కుపాదం..
గృహ వినియోగాలకు సంబంధించి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులు వాడితే.. పౌర సరఫరాల అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కొందరు వ్యాపారులు కట్టెలపోయినే ఆశ్రయిస్తుండగా మరి కొందరు హోటల్లను, రెస్టారెంట్లను మూసేస్తున్నారు.
గ్యాస్ ఉంటేనే టిఫిన్ బండ్లు నడిపేది..
రోడ్ల వెంట టిఫిన్ బండ్లు పెట్టుకుని చాలా మంది కుటుంబాలను పోషింకుంటున్నారు. గ్యాస్ కొరత వారిని రోడ్డున పడేస్తోంది. కమర్షియల్ గ్యాస్ నిషేధించడంతో డొమెస్టిక్ గ్యాస్ వాడే పరిస్థితి లేదు. ఒకవేళ వాడినా పౌర సరఫరా అధికారులు కేసులు నమోదు చేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం ఆగి కమర్షియల్ సిలిండర్లు సరఫరా అయితే తప్ప వారి వ్యాపారం సాగే పరిస్థితి కనిపించడం లేదు.
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో డొమెస్టిక్ గ్యాస్ (గృహ అవసరాల)కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కమర్షియల్ గ్యాస్ వాడే హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లకు సరఫరా నిలిచిపోయింది. ఏజెన్సీల వద్ద స్టాక్ ఉన్న వరకు ఇచ్చేశాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూత పడున్నాయి. కొన్ని మెస్‌లు, హాస్టళ్లు, బిర్యానీ సెంటర్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తూ కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల బట్టీ పొయ్యిలు ప్రారంభించారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్
ఫ కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేసిన ప్రభుత్వం
ఫ కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిపైనే వంటకాలు..
ఫ రోడ్డున పడ్డ వీధి వ్యాపారులు


