నకిరేకల్‌ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నకిరేకల్‌ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

Mar 30 2026 7:25 AM | Updated on Mar 30 2026 7:25 AM

నకిరేకల్‌ : ‘నకిరేకల్‌ నియోజకవర్గ ప్రజలు నాకు రెండు దఫాలు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. వారి సంక్షేమం కోసం నిరంతరం ఓ సేవకుడిగా పని చేస్తున్నాను. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నకిరేకల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం’ అని ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఇతర మంత్రుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేశామన్నారు. నకిరేకల్‌ మండలం కడపర్తిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటేడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మాణంలో ఉందన్నారు. రూ.101 కోట్లతో అయిటిపాము లిఫ్ట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. మూసీ ప్రాజెక్టు వద్ద మరో వంతెన నిర్మించాలని ముఖ్యమంత్రి విన్నవించానని చెప్పారు. నకిరేకల్‌ మున్సిపాలిటీతో పాటు, అన్ని మండల కేంద్రాలు, గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

ఫ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement