కోదాడ : మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెంలో ఆదివారం జరిగిన వారాంతపు సంతలో సామాజిక కార్యకర్త, తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ బ్రాహ్మణుడి వేషధారణలో ఉగాది పంచాంగం చెబుతూ గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని వినూత్నంగా అవగాహన కల్పిచారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటే సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోతే తీవ్ర ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డు న పడుతాయన్నారు. కార్యక్రమంలో వెంకటనా రాయణ, నరేష్, జయకృష్ణ, రవి పాల్గొన్నారు.


