రోడ్డు ప్రమాదంలో పూజారి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పూజారి దుర్మరణం

Mar 30 2026 7:24 AM | Updated on Mar 30 2026 7:24 AM

మిర్యాలగూడ అర్బన్‌ : బైక్‌పై వెళ్తున్న పూజారిని లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని రాంనగర్‌బందం వద్ద జరిగింది. వన్‌టౌన్‌ సీఐ నాగభూషణరావు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రానికి చెందిన కందాల హరికృష్ణ(45) మిర్యాలగూడ పట్టణంలో నివాసముంటున్నాడు. ప్రతిరోజు ఉదయం మిర్యాలగూడ నుంచి వెళ్లి పాలకీడు మండల కేంద్రంలోని దేవాలయానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరిగి వస్తుంటాడు. ఆదివారం ఉదయం కూడా పూజలు చేయడానికి పాలకీడుకు బైక్‌పై వెళ్తుండగా.. మిర్యాలగూడ పట్టణంలోని రాంనగర్‌బందం వద్ద లారీ వెనుక నుంచి వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో హరికృష్ణ ఎగిరి రోడ్డుపై పడిపోగా అతడి పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుస్తుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement