రసవత్తరంగా ఎడ్ల పందేలు | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా ఎడ్ల పందేలు

Mar 30 2026 7:24 AM | Updated on Mar 30 2026 7:24 AM

మఠంపల్లి : మండలంలోని రఘునాథపాలెంలో రామనవమి వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ఆదివారం రెండోరోజూ రసవత్తరంగా సాగాయి. సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మంతో పాటు ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఒంగోలు గిత్తలు ఈ పోటీల్లో పాల్గొని బండ లాగాయి. మరో మూడురోజుల పాటు ఈ పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కమనీనరసింహారావు, మాజీ ఎంపీపీ తిరుమలశెట్టి అప్పయ్య, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ రామచంద్రయ్య, ఉప సర్పంచ్‌ శ్రీనివాసరెడ్డి, సయ్యద్‌ నిజాం, బొబ్బా రవీందర్‌రెడ్డి, నాగుల్‌మీరా, నాయుడు ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ మేడి సామేలు, దస్తగిరి, సంకలమద్ది అప్పిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement