తొలి రోజు 37 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

తొలి రోజు 37 మంది గైర్హాజరు

Mar 15 2026 5:02 AM | Updated on Mar 15 2026 5:02 AM

నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 106 పరీక్ష కేంద్రాల్లో తెలుగు పరీక్ష నిర్వహించినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. పరీక్ష రెగ్యులర్‌ విద్యార్థులు 19,653 మందిగాను.. 19,619 మంది పరీక్ష రాశారు. 34 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్‌ విద్యార్థులు 19 మందికి గాను 16 మంది హాజరయ్యారు. ముగ్గురు.. మొత్తం 37 మంది గైర్హాజరయ్యారు.

పరీక్ష కేంద్రాల తనిఖీ

పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తనిఖీ చేశారు. శనివారం నల్లగొండలోని సెయింట్‌ ఆల్ఫోన్సెస్‌ పాఠశాల, మండలంలోని దోమలపల్లి జెడ్పీహెచ్‌లోని పరీక్ష కేంద్రాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల మౌలిక వసతులు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాలవద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రంలోకి ఇతరులేవరూ వెళ్లకుండా చూడాలన్నారు. విద్యార్థులను పూర్తగా తనిఖీ చేయాలని, జిల్లాలో ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement