నల్లగొండ : నల్లగొండ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన మార్కెట్ చైర్మన్ పదవీకాలం ఆరు నెలలు పొడిగించడంపై జూకూరి రమేష్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి సహకారంతో రైతుల సమస్యల పరి ష్కారమే ధ్యేయంగా పని చేస్తానని తెలిపారు.
కార్మికుల సమస్యలను అసెంబ్లీలో చర్చించాలి
నల్లగొండ టౌన్ : రాష్ట్రంలోని కార్మికుల సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలోని ఎస్‌సీఐ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సీఐటీయూ జిల్లా 13వ మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను అమలు చేయబోమని తీర్మాణించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కనీస వేతనం అమలు చేయని కారణంగా కోటి మంది కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2023 జూలై నుంచి పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తుమ్మల వీరారెడ్డి, చిన్నపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు, పరిపూర్ణాచారి, ఎండీ.సలీం, మల్లు గౌతంరెడ్డి, సైదులు, బి.ప్రమీల, దందెంపల్లి సత్తయ్య, చింతపల్లి బయ్యన్న, నల్ల వెంకటయ్య, కానుగు లింగస్వామి, అవుట రవీందర్, జిట్టా నగేష్, శ్రీనివాస్, రాజు, నర్సింహ, పోలె సత్యనారాయణ, వెంకటమ్మ, పార్వతి, అంజయ్య, సైదాచారి, అనురాధ, సునీత, శ్రీవాణి, దయానంద్, ముత్యాలు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలి
మిర్యాలగూడ : మన సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు సాంఘిక, పద్య నాటికలు ఎంతగానో దోహదపడుతాయని రిటైర్డ్ ఉపాధ్యాయుడు, కవి, రచయిత వారణాసి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య నాటక, సాంఘిక నాటిక పోటీలు ఆరవ రోజు కొనసాగాయి. ఈ పోటీలను శనివారం ఆయన తెలంగాణ నాటక సమాఖ్య సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు విలకత్తుల పుల్లయ్యతో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. పద్యాల ద్వారా తెలుగు భాషలోని మాధుర్యం, స్పష్టమైన ఉచ్చారణ, పదజాలంపై పట్టు పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో తడకమళ్ల రామచంద్రరావు, రామవతారం, పులి కృష్ణమూర్తి శర్మ, వెంకటలక్ష్మీనారాయణశర్మ, సాయిలు, సత్యనారాయణచారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శైలజ, సరస్వతి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, రాజారాం పాల్గొన్నారు.
జల నారాయణుడికి మంగళహారతులు
భువనగిరి : భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి జల నారాయణ స్వామికి మంగళహారతుల సమర్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి ఉదయం సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


