వంట నూనె ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అన్ని రకాల నూనెలు గత నెల కంటే రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగిపోయి కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలను తగ్గించాలి.
– ఆండాలు, గృహిణి, శివాజీనగర్, నల్లగొండ
వంట నూనెల ధరలను నియంత్రించడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ధరలను నియంత్రించే యంత్రాంగం ఉన్నా వ్యాపారులు ఇష్టానురీతిగా పెంచుతున్నారు. వంట నూనెల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలి.
– రొయ్య కిరణ్, దేవరకొండ రోడ్డు


