ముందుగా కల్లాలు తెరిచేలా..
వ్యాపారులు అందుబాటులో లేరు
గుర్రంపోడు : బత్తాయి రైతుకు సీజన్ ఆరంభంలోనే కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. వ్యాపారం పుంజుకునే ప్రస్తుతం తరుణంలో ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుండడం, ఈ నెలలో ఉగాది, రంజాన్ పండుగలు రావడంతో మార్కెట్‌పై ప్రభావం పడింది. దీంతో ప్రస్తుత వేసవిలో బత్తాయి ధర పెరగకపోగా కోతలు నిలిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా బత్తాయి, నిమ్మ కాయలకు అంతగా విదేశీ ఎగుమతులు ఉండవు. ఎగుమతులకు అవసరమయ్యే లారీల కొరత కారణంగా మార్కెట్ స్తంభించింది.
సొంత ప్రాంతాలకు వెళ్లిన లారీలు
ఢిల్లీ పరిసర ప్రాంతాల లారీల డైవర్లు హోలీ పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయి ఇంకా తిరిగా రాలేదు. ఈసారి కురిసిన అధిక వర్షాలకు కశ్మీర్‌లో ఆపిల్ పంట దెబ్బతినడంతో విదేశీ దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చింది. యుద్ధ ప్రభావం వల్ల విదేశాల నుంచి విమానాల ద్వారా ఆపిల్, ఇతర పండ్ల దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో లారీలకు కిరాయిలు దొరకక అక్కడే నిలిచిపోవడంతో ఇక్కడ లారీల కొరత ఏర్పడింది. లారీల కిరాయిలు 10 శాతం మేర పెరగడంతో వ్యాపారులు కూడా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. రంజాన్ పండుగ కారణంగా కూలీల కొరత, మార్కెట్‌లో క్రయవిక్రయాల్లో మందగమనం నెలకొంది.
కత్తెర పంట కోతలోనూ జాప్యం
బత్తాయి కత్తెర దిగుబడులు సాధారణంగా మార్చి నెల నుంచి ప్రారంభమమవుతాయి. ఇప్పటికీ కొన్నిచోట్ల కత్తెర ముందు సీజన్ కాయల కోతలు పూర్తికాలేదు. ఆ కాయలకు కత్తెర దిగుబడుల్లో కలిసి అధిక ధర వస్తుందని ఆశిస్తున్నా కోయడంలో జాప్యం జరిగి కాయలు రాలిపోతున్నాయి. ఇప్పటికే రేటు కుదుర్చుకున్న వ్యాపారులు పలు కారణాల వల్ల కాయలు కోయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యాసంగి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే అక్కడక్కడా వరికోతలు ప్రారంభం కావడంతో రైతులు కల్లాలకు ధాన్యం తీసుకువస్తున్నారు. గత ఏడాది యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ 1న ప్రారంభించగా ఈసారి అంతకు ముందే ధాన్యం కొనుగోళ్లు చేయాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి సూచించడంతో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 23న నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశంలో కొనుగోళ్ల తేదీపై స్పష్టత రానుంది.
దిగుబడి అంచనా..
జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 6 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లర్లు కొనుగోలు చేస్తారని, మిగిలిన ధాన్యం ఐకేపీ, పీఏసీఎస్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయనున్నారు.
పెరగనున్న కేంద్రాలు
యాసంగి సీజన్లో దిగుబడి అధికంగా వస్తున్నందున దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గత సంవత్సరం 375 కొనుగోలు కేంద్రాల వరకు ఏర్పాటు చేయగా ఈసారి 400 వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి ఎక్కడైతే ధాన్యం అధికంగా వస్తుందో అక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ప్రధాన శాఖల అధికారులు, మిల్లర్లతో కూడా సమావేశం నిర్వహించారు. యాసంగి కొనుగోళ్లలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
వరికోతలు ప్రారంభం కావడంతో ఏ క్షణమైనా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు. తూకం యంత్రాలతో పాటు టార్పాలిన్లు, గన్నీబ్యాగ్‌లు, టెంట్లు, ఇతర పరికరాలను సమకూర్చుతున్నారు. జిల్లాకు 2 కోట్ల వరకు గన్నీ బ్యాకులు అవసరం ఉంటాయని అంచనా వేశారు. అందులో ఇప్పటికే జిల్లాలో 70 లక్షల వరకు గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి. మిగితా వాటిని సమకూర్చుకునే కార్యాచరణపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు.
జిల్లాలోని తిప్పర్తి మండలంలో ఇప్పటికే వరికోతలు ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు కల్లాలకు ధాన్యం తెచ్చి ఆరబెడుతున్నారు. దీంతో గత సీజన్ కంటే ముందుగానే ఈసారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. నెల 23వ తేదీన, లేదంటే ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్రంలోనే ముందుగా నల్లగొండ జిల్లాలోని ఆర్జాలబావి, తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1న ప్రారంభించారు. ఈసారి అంతకంటే ముందే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేలా మంత్రి సూచనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసారి ఏడు మిల్లులు బ్లాక్‌లో ఉన్నందున ఆ మిల్లులకు పోయే ధాన్యాన్ని ఇతర మిల్లులకు మళ్లించి కొనుగోళ్లు చేపట్టేలా, ట్రాన్స్‌పోర్టు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మిల్లుల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు.
ఉగాది, రంజాన్ పండుగల ప్రభావం వల్ల స్థానికంగా కూలీల కొరత ఉంది. ఢిల్లీ మార్కెట్‌లో వ్యాపారులు అందుబాటులో ఉండకపోవడం వల్ల ఈ వారం బత్తాయి మార్కెట్ మందకొడిగానే సాగుతోంది. కొద్ది రోజులుగా లారీలు అందుబాటులో లేక కాయలు కోయలేకపోయాం. వచ్చే వారం నుంచి మార్కెట్లు పుంజుకుని బత్తాయి ధర పెరిగే అవకాశం ఉంది.
– శంకర్‌రావు, బత్తాయి వ్యాపారి, కొప్పోలు
ధరలేని కత్తెర పంట
ఫ వరుస పండుగలు..లారీల కొరతే కారణం
ఫ యుద్ధ ప్రభావంతో నిలిచిన ఎగుమతులు
ఫ ఇబ్బందుల్లో బత్తాయి రైతులు
ఫ 23 తర్వాత యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభించే అవకాశం
ఫ మంత్రి ఆదేశంతో ఈ సారి ముందుగానే కేంద్రాలు
ఫ ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం
ధాన్యం (లక్షల మెట్రిక్ టన్నుల్లో)
దిగుబడి అంచనా 14
మార్కెట్‌కు వచ్చేది 8
మిల్లర్లు కొనేది 6
కొనుగోలు కేంద్రాలు 400
అవసరమైన గన్నీ బ్యాగులు 2 కోట్లు
అందుబాటులో ఉన్నవి 70 లక్షలు


