నూనెల ధరలు ౖపైపెకి.. | - | Sakshi
Sakshi News home page

నూనెల ధరలు ౖపైపెకి..

Mar 20 2026 8:25 AM | Updated on Mar 20 2026 8:25 AM

నల్లగొండ టౌన్‌ : నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన వంట నూనెల ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. గత నెలలో ఉన్న ధర కంటే ప్రస్తుతం కిలో ప్యాకెట్‌పై రూ.30 పెరిగింది. దాదాపు 20 రోజుల క్రితమే పామాయిల్‌, ప్రీడమ్‌ ఆయిల్‌, పల్లీ నూనె ధరలన్నీ పెరిగి పోయాయి. ప్రస్తుతం ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపి హోల్‌సేల్‌, రిటేల్‌ వ్యాపారులు వంట నూనెల ధరలను పెంచేస్తున్నారు. ఈ క్రమంలో హోల్‌సేల్‌ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరను పెంచుతూ పోతున్నారు. జిల్లా అంతటా వంట నూనెల పరిస్థితి ఇలాగే ఉంది.

హోల్‌సేల్‌ డీలర్లు సిండికేట్‌గా మారి..

గత నెలలో పామాయిల్‌ కిలో ప్యాకెట్‌ ధర రూ.130 ఉండగా ప్రస్తుతం రూ.140కి చేరింది. ప్రీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ గత నెలలో కిలో రూ.140 ఉండగా ప్రస్తుతం రూ.170 అయ్యింది. వేరుశగన (పల్లీ) నూనె గతంలో రూ.150 ఉండగా ప్రస్తుతం రూ.170కి చేరింది. హోల్‌సేల్‌ డీలర్లు సిండికేట్‌గా ఏర్పడి యుద్ధాన్ని సాకుగా చూపుతూ నూనెల ధరలు పెంచుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంట నూనెల ధరలు నియంత్రించాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో హోల్‌సేల్‌ వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం శుభాకార్యాల సీజన్‌ కావడంతో పాటు ఉగాది, రంజాన్‌ పండుగల నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వంట నూనెల ధరలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.

ఫ కిలో రూ.170కి చేరిన పల్లీ, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌

ఫ గత నెల కంటే రూ.20 నుంచి రూ.30 పెరుగుదల

ఫ యుద్ధం సాకుతో సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు

ఫ ఆందోళనలో సామాన్య ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement