నల్లగొండ టౌన్ : మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం అన్నారు. గురువారం నల్లగొండలోని ఆ సంఘం కార్యాలయంలో చింతకాయల సంతోష్ అధ్యక్షతన నిర్వహించిన సీఐటీయూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఈనెల 24న హైదరాబాద్‌లోనిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో శ్రీనివాస్, పెరిక కృష్ణ, మోహన్, పి.లింగయ్య, రాములు, లక్ష్మయ్య, నాగరాజు, శివ పాల్గొన్నారు.


