ఫ కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ: ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండలోని కలెక్టరేట్‌లో గురువారం ఆయన తన ఛాంబర్‌లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉదయ సముద్రం, మాద ఎడవల్లి, శివన్నగూడెం, అంబ భవాని, డిండి, నక్కలగండి, ఏకేబియర్, పెండ్లిపాకల చింతచెట్టు తండా ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుల వారీగా పురోగతిని సమీక్షిస్తూ, భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపుల అంశాల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించి, రైతులకు సమయానికి పరిహారం చెల్లించాలన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పునరావాసం పొందిన కుటుంబాలకు అన్ని సదుపాయాలు అందించేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి పాల్గొన్నారు.
వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి
నల్లగొండ: నల్లగొండలోని కలెక్టరేట్‌లో వృద్ధులకు, దివ్యాంగులకు ప్రతి నెలా చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు వయో వృద్ధుల జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణికి వృద్ధులు, దివ్యాంగులు హాజరై వారి సమస్యలు తెలపొచ్చని పేర్కొన్నారు.
కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉన్నత ఉద్యోగాలు
రామగిరి(నల్లగొండ): కంప్యూటర్ సైన్స్ రంగంలో నైపుణ్యం సాధిస్తే ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని నాగార్జునసాగర్ బీసీ గురుకుల డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బొబ్బిలి రాజా అన్నారు. గురువారం ఎన్జీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉద్యోగ అన్వేషణ, అవకాశాలు’ అనే అంశంపై విస్తృతోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని సమన్వయం చేసుకుంటూ రాణించాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో లభిస్తున్న ఉద్యోగ అవకాశాలపై వివరించారు. ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ఈ సదస్సు ద్వారా విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక రంగాలపై అవగాహన పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తు కెరీర్ ఎంపికలో స్పష్టత కలిగించడం ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ ఇన్‌చార్జ్ వెంకటరమణ, వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్, ప్రొఫెసర్ శ్రీనివాసులు, సీఓఈ మునిస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ నాగరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.
రేపు జాతీయ లోక్ అదాలత్
రామగిరి(నల్లగొండ): లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పెండింగ్, ప్రీ లిటిగేషన్ కేసుల పరిష్కారానికి శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ (పూర్తి అదనపు బాధ్యతలు) పురుషోత్తంరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నల్లగొండకు అన్యాయం చేయొద్దు
నల్లగొండ టౌన్ : డిండి ఎత్తిపోతల పథకం విషయంలో నల్లగొండకు అన్యాయం జరగకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రాజెక్టు డీపీఆర్ ప్రకారమే నీటిని తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఏదుల వద్ద 436 మీటర్ల నీటి మట్టం నుంచే డిండికి నీటిని తీసుకునేలా ప్రభుత్వం అనుమతించాలని కోరారు. ఇంజినీర్ల బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం 440 మీటర్ల నీటి మట్టం నుంచి నీటిని తీసుకోవాలంటే తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ఉద్యోగులకు
భద్రత కల్పించాలి
పెద్దవూర : అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణావత్ సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 29న హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర అవుట్‌సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్లను గురువారం పెద్దవూరలో ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు షబ్బీర్, కృష్ణ, శ్రీనునాయక్, ఎండీ.షాహీన్ బేగం, రాంరెడ్డి, డి.సైదులు, షాహదా బేగం, జ్యోతి పాల్గొన్నారు.


