మిర్యాలగూడ : పట్టణంలోని ఎన్‌ఎస్పీ క్యాంప్ గ్రౌండ్‌లో శుక్రవారం త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో మహాలక్ష్మి యాగం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం హౌసింగ్‌బోర్డు కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎన్‌ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ వరకు వైభవంగా యాగ శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, మిల్లర్లు గందె రాము, బండారు కుశలయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, మాధవి, చిలుకల రవికుమార్, ప్రసాద్, కారంపూడి జానకిరాఘవచార్యులు, గుడిపాటి నాగేందర్, రేపాల పురుశోత్తంరెడ్డి, మాజీ సర్పంచ్ సీతారాములు పాల్గొన్నారు.


