నార్కట్‌పల్లి : ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు ప్రతిఒక్కరూ సహకరించాలని నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నార్కట్‌పల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులతోపాటు శ్రీరామ నవమి వేడుకల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ త్వరగా రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయాలన్నారు. దుకాణాలు రోడ్డుపైకి రాకుండా.. ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని సీఐ నాగరాజు, ఎస్‌ఐ విష్ణుమూర్తికి సూచించారు. ఆయన వెంట సర్పంచ్ జేరిపోతుల భరత్, ఎస్‌బీ సీఐ రాము, సట్టు సత్తయ్య, పాశం శ్రీనివాస్‌రెడ్డి, పుల్లెంల అచ్చాలు, పుల్లెంల శ్రీనివాస్ ఉన్నారు.


