వీఓఏలపై పనిభారం తగ్గించాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

వీఓఏలపై పనిభారం తగ్గించాలని ధర్నా

Mar 17 2026 7:28 AM | Updated on Mar 17 2026 7:28 AM

నల్లగొండ టౌన్‌ : విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌(వీఓఏ)లపై పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ.సలీం, వీఓఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు వీఓఏలకు రూ.20వేల కనీస వేతనాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. వీఓఏల సమస్యలన్నీ పరిష్కరించకపోతే ఈనెల 25న చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపడతామన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాజు, బషీర్‌, పోలే సత్యనారాయణ, వెంకన్న, రేణుక, సువర్ణ, నగేష్‌, పాపయ్య, సావిత్రి, శైలజ, రాజు, సైదులు, సుమీలా, పుష్ప, మంగ, అజిత, కలమ్మ, పుష్పలత, కోటిరెడ్డి, పద్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement