రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

Mar 27 2026 9:28 AM | Updated on Mar 27 2026 9:28 AM

నల్లగొండ టూటౌన్‌: రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య విలేకరులతో మాట్లాడారు. రైతు భరోసా డబ్బులు ఒకేసారి రైతులందరి ఖాతాల్లో జమ చేయాలన్నారు. వరికోతలు ప్రారంభమైనందున ఐకేపీ కేంద్రాలు ప్రారంభించాలని, మిగిలినపోయిన వారి రైతు రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. పామాయిల్‌ ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. వీబీజీ రామ్‌ జీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు అందజేశారు. ఆయన వెంట కిసాన్‌ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌, సెంట్రల్‌ హైదరాబాద్‌ ఇన్‌చార్జి వీరెళ్లి చంద్రశేఖర్‌, భూనిర్వాసితుల సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ భవనం మధుసూదన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, కన్మంతరెడ్డి అశోక్‌రెడ్డి, పోతెపాక లింగస్వామి, గుండా నవీన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మిర్యాల వెంకటేశం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement