నల్లగొండ: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్‌సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, 327 యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండలో డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 8న తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. మీటర్ రీడింగ్ కార్మికులు, కలెక్షన్ ఏజెంట్లు, ఎస్‌పీఎం వర్కర్లు, సెక్యూరిటీ గార్డులకు జీఓ నంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిట్టబోయిన లింగస్వామి యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, అవుట రవీందర్, పురం రాంబాబు, మైనం ఊషయ్య, చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, దుప్పలపల్లి రమేష్, బొజ్జ సహదేవ్, మేకల భిక్షమయ్య, పెరిక శేఖర్, విజయ్, ఉమాదేవి, రఫీయా, శైలజ, లింగారెడ్డి, భూషణం, ఆవుల పరమేష్, శ్రీపతి రమేష్, ఎస్‌కే ఖాన్, మురళి, మేకల నరసింహ, మల్లేష్, నాగమణి పాల్గొన్నారు.
ట్రాక్టర్ చోరీ చేసిన దొంగల అరెస్టు
నార్కట్‌పల్లి : ట్రాక్టర్ చోరీ చేసిన ఇద్దరు దొంగలను నార్కట్‌పల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. గతేడాది ఆగస్టు 7న అర్ధరాత్రి నార్కట్‌పల్లి మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన నకరేకంటి రమేష్ ట్రాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. రమేష్ ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఏపీలోని పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కరచోల గ్రామానికి చెందిన మదన రవీంద్రనాథ్‌రెడ్డి, ఎన్నిరెడ్డి బాపిరెడ్డి ట్రాక్టర్ చోరీ చేసినట్లు గుర్తించి వారిని గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి, పోలీస్ సిబ్బంది సత్యనారాయణ, గిరిబాబును సీఐ కె. నాగరాజు అభినందించారు.


