అలరిస్తున్న సాంఘిక నాటక పోటీలు | - | Sakshi
Sakshi News home page

అలరిస్తున్న సాంఘిక నాటక పోటీలు

Mar 12 2026 7:44 AM | Updated on Mar 12 2026 7:44 AM

మిర్యాలగూడ : పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పద్య నాటక, సాంఘిక నాటిక పోటీలు అలరిస్తున్నాయి. బుధవారం 3వ ఈ పోటీలను ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రంగా రవికుమార్‌, రంగా శ్రీధర్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. ‘త్యాగశీలి దధీచి మహర్షి’ అనే పద్య నాటకాన్ని టీబీఆర్‌ ఆర్ట్స్‌ హైదరాబాద్‌ వారు, ‘భక్త ప్రహ్లాద’ పద్య నాటకాన్ని నవక్రాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌, ‘ఉరి’ సాంఘిక నాటికను వెలగలేరు థియేటర్‌ ఆర్ట్స్‌ వెలగలేరు, ‘వేదాంతం’ సాంఘిక నాటికను శ్రీ షిర్డిసాయి కల్చరల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అనకాపల్లి, ‘తితీక్ష’ సాంఘిక నాటికను బివికె క్రియేషన్స్‌ కాకినాడ వారు నిర్వహించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ల రామచంద్రరావు, అధ్యక్షుడు రామావతారం, కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, వెంకటలక్ష్మీనారాయణశర్మ, సాయిలు, సత్యనారాయణచారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శైలజ, సరస్వతి, ఉపేందర్‌, బాబురావు, వీరప్రతాప్‌, రాజారాం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement