రామగిరి(నల్లగొండ): సర్పంచులు గ్రామాభివృద్ధిపై దష్టి సారించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్స్‌లో గురువారం సర్పంచులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, డ్రెయినేజీ, తాగునీటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. పేదలంకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా కృషిచేయాలన్నారు. నూతన సర్పంచులకు పలు విషయాలపై అవగాహ కల్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, అదనపు కలెక్టర్‌లు జె.శ్రీనివాస్, వై.అశోక్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్‌రెడ్డి, డీపీఓ శంకర్ నాయక్, నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


