రామగిరి (నల్లగొండ) : గ్రీన్ ఎనర్జీ సుస్థిరమైన భవిష్యత్తు ఇస్తుందని, గ్లోబర్ వార్మింగ్‌ను అరికట్టి సహజ వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ ముఖ్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ నాగారపు లింగయ్య అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో భారతదేశంలో హరిత ఇంధన వనరుల ప్రాముఖ్యత–పర్యావరణ పరిరక్షణపె రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఔషధాల కొనుగోలు ఎంత ముఖ్యమో పర్యావరణాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ రాము శ్రీధర్ ప్రసంగిస్తూ కార్బోహైడ్రెట్ల ప్రాముఖ్యతను వివరించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ ఐఐటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిషోర్ నట్టే ఫ్లోరిన్ బ్రోమిన్ రసాయనిక చర్యల ఉపయోగాలు ఔషధాల తయారీలో వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పరంగి రవి కుమార్ మాట్లాడుతూ కాలుష్యాన్ని అరికట్టడానికి హరిత ఇంధన వనరులే ఏకై క మార్గమని అన్నారు. సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు మాట్లాడుతూ శిలాజ ఇంధన కాలుష్యం నుంచి దేశాన్ని కాపాడాలన్నారు. సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ సదస్సులో సీఓఈ డాక్టర్ డి.మునిస్వామి, అకడమిక్ కోఆర్నినేటర్ బత్తిని నాగరాజు, రసాయన శాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ అనిల్ అ బ్రహం, డాక్టర్ అనిల్ బొజ్జ, డాక్టర్ బి.వెంకటేశ్వ ర్లు, అధ్యాపకులు డాక్టర్ సి.జ్యోత్స్న పాల్గొన్నారు.


