ప్రజాప్రతినిధులు బాధ్యతగా మెలగాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజాప్రతినిధులు బాధ్యతగా మెలగాలి

Mar 13 2026 7:38 AM | Updated on Mar 13 2026 7:38 AM

నల్లగొండ టూటౌన్‌ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం నల్లగొండలోని జిల్లా పరిషత్‌ హాల్‌లో మున్సిపల్‌ కౌన్సిలర్లు, చైర్మన్లు, నీలగిరి కార్పొరేషన్‌ కార్పొరేటర్లకు నిర్వహించిన శిక్షణలో మంత్రి మాట్లాడారు. ప్రజలకు మేలు చేయడానికి ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రస్తుత వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. నల్లగొండ నగర మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికై న ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం సంతోషించదగిన విషయమన్నారు. కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్‌ చొరవ తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ కేతావత్‌ శంకర్‌నాయక్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కృషిచేయాలని కోరారు.

మెప్మా పీడీపై మంత్రి ఆగ్రహం

మెప్మా కొత్త గ్రూపులు, రుణాలకు సంబంధించి తగిన సమాచారం లేకుండా వచ్చిన మెప్మా పీడీ శ్రీనివాస్‌పై మంత్రి మండిపడ్డారు. పీడీ కొత్తగా వచ్చానని చెప్పడంతో అన్ని తెల్చుకుని రావాలి.. కొత్తగా వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులకు ఏం చెబుతారని మంత్రి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ అమిత్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అశోక్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ జూకూరి రమేష్‌, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, నల్లగొండ కార్పొరేషన్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

ఫ ప్రజల మేలుకే 99 రోజుల కార్యాచరణ

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement