ప్రరిశ్రమల ఏర్పాటులో రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నల్లగొండ జిల్లా | - | Sakshi
Sakshi News home page

ప్రరిశ్రమల ఏర్పాటులో రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నల్లగొండ జిల్లా

Mar 22 2026 6:03 AM | Updated on Mar 22 2026 6:03 AM

జీడీడీపీలో ఐదోస్థానం తలసరి ఆదాయంలో యాదాద్రి ముందంజ ఎస్సీ, ఎస్టీలకు తక్కువ భూములు

స్థూల జిల్లా ఉత్పత్తిలో (జీడీడీపీ) రాష్ట్రంలోనే నల్లగొండ ఐదో స్థానంలో ఉండగా, సూర్యాపేట 9వ స్థానంలో, యాదాద్రి జిల్లా 14వ స్థానంలో ఉన్నాయి. యాదాద్రి, సూర్యాపేటతో పోలిస్తే నల్లగొండ ముందువరుసలో ఉంది. నల్లగొండలో రూ.64,219 కోట్లు, సూర్యాపేటలో రూ.38,865 కోట్లు, యాదాద్రిలో రూ.30,924 కోట్లుగా జీడీడీపీ నమోదైంది.

తలసరి ఆదాయంలో నల్లగొండ, సూర్యాపేటతో పోల్చితే యాదాద్రి జిల్లా ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తలసరి ఆదాయంలో యాదాద్రి జిల్లా 8వ స్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా 9వ స్థానంలో, సూర్యాపేట జిల్లా 14వ స్థానంలో ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో సగటున ప్రతి వ్యక్తి ఆదాయం రూ.3,35,264 కాగా, నల్లగొండలో రూ.3,30,216గా నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 2,96,429గా నమోదైంది.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి తరువాత అత్యధికంగా నల్లగొండలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రై జెస్‌ (ఎంఎస్‌ఎంఈ) వద్ద, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఉద్యమ్‌ పోర్టల్‌లోనూ ఔత్సాహికులు వివిధ రకాల ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2026 వెల్లడించింది. పారిశ్రామికరంగంతో పాటు వివిధ రంగాల్లో ఉమ్మడి నల్లగొండ ఏ స్థానంలో ఉందన్న విషయాలను ఈ సర్వేలో ప్రభుత్వం వివరించింది.

ఫ ఉద్యమ్‌ పోర్టల్‌, ఎంఎస్‌ఎంఈ వద్ద భారీగా ఔత్సాహికుల దరఖాస్తులు

ఫ 1051 రేషన్‌ దుకాణాలతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నల్లగొండ

ఫ జీడీడీపీలో 5వ, తలసరి ఆదాయంలో 9వ స్థానం

ఫ ఎస్సీ, ఎస్టీల చేతిలో ఉన్న భూమి తక్కువే

ఫ సోషియో ఎకనామిక్‌ఔట్‌లుక్‌–2026 వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement