యాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తల మధ్యన నిత్య ఆర్జిత కై ంకర్యాలు విశేషంగా జరిగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు.ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం చేపట్టారు. సాయంత్రం భక్తుల కోలాహలం నడుమ జోడు సేవలను మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


