బి.వెల్లెంల ప్రాజెక్టు నీటిని పరిశీలించడానికి అప్పాజిపేట వద్ద బైక్ నడుపుతూ వెళ్తున్న మంత్రి
బి.వెల్లెంల ప్రాజెక్టు కాల్వను పరిశీలిస్తున్న
మంత్రి కోమటిరెడ్డి
రామగిరి(నల్లగొండ) : బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో నల్లగొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి వచ్చే కాల్వలలను బైక్‌పై తిరుగుతూ పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొండపాకగూడెం నుంచి అప్పాజీపేట వరకు నూతనంగా ఏర్పాటు చేసే పిల్ల కాలువ పనులకు అప్పాజిపేటలో శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలువ ద్వారా అప్పాజీపేట కాకి చెరువు, బంటుగూడెం చెరువులను నిండుతాయన్నారు. కాలువ పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగుల ఆండాలుసైదులు, ఉప సర్పంచ్ పోలె సతీష్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ బైక్‌పై తిరిగి బ్రాహ్మణ వెల్లెంల కాల్వల పరిశీలన


