నల్లగొండ : జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. బుధవారం నల్లగొండలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నమోదవుతున్న నేరాల పరిస్థితి, పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తు పురోగతి, కోర్టుల ద్వారా నేరస్తులకు శిక్షలు పడేలా చేపడుతున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని సూచించారు. పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి కోర్టుల్లో చార్జ్‌షీట్లు సకాలంలో దాఖలు చేయాలని ఆదేవించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు ప్రజలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని తెలిపారు. దొంగతనాల నివారణకు పగలు, రాత్రి పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. గంజాయి రవాణా, జూదం, పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖరరాజు, శ్రీనివాసరావు, రవి, లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్రపవార్


