యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గత నెలలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా జాతా శౌచంతో పాల్గొని పూజలు నిర్వహించిన ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులుపై చర్యలు తీసుకోవాలని ఈఓ భవానీ శంకర్‌కు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం వినతిపత్రం ఇచ్చారు. కాండూరు వెంకటాచార్యులు సొంత బంధువు కాండూరి భార్గవ్‌కు శిశువు జన్మించగా.. హిందూ సాంప్రదాయం ప్రకారం శిశువు జన్మించిన రోజు నుంచి ఆ కుటుంబానికి చెందిన వారికి పది రోజుల పాటు జాతక శౌచం ఉంటుందని, అయినప్పటికీ ఫిబ్రవరి 25న స్వామివారి కల్యాణోత్సవాన్ని ఆయన జరిపించారని నల్ల రాధాకృష్ణ ఆరోపించారు. కాండూరి వెంకటాచార్యులుతో పాటు ముఖ్య అర్చకులు శ్రీనివాసచార్యులు సైతం శాస్త్ర విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సైతం ఆయన మైలలోనే స్వయంగా పట్టుకున్నారని విమర్శించారు. ఈ అంశంపై దేవాదాయశాఖ అధికారులు ఐఏఎస్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో కమిటీ వేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో దళిత సంఘర్షణ సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గద్ద యుగంధర్, తెలంగాణ సీనియర్ సిటిజనన్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ హనుమాండ్ల విష్ణు, టేకి రాజశేఖర్, వీహెచ్‌పీ కొమ్మగళ్ల వెంకటేశ్వర్లు, శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాల పరిరక్షణ సమితి కన్వీనర్ కనుకుంట్ల విజయకుమార్, బీజేపీ నాయకులు బొల్లం చంద్రమౌళి, మన్నెం నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.
ఫ జాతక శౌచంతో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శాస్త్ర విరుద్ధంగా వ్యవహరించారు
ఫ ఈఓ భవానీ శంకర్‌కు విన్నవించిన
వివిధ సంఘాల నాయకులు


