సూర్యాపేటటౌన్ : చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం సూర్యాపేట ఎస్పీ నరసింహ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడలోని రాజీవ్‌నగర్‌కు చెందిన కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేష్, కంచుకొమ్ముల సాయికిరణ్, సూర్యాపేటకు చెందిన షేక్ నస్రీన్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఆటోలను దొంగిలించి అదే ఆటోలో ప్రయాణిస్తూ ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధ మహిళలను బెదిరించి ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో పాటు రాత్రివేళ తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు చేస్తుండేవారు. ఈ నెల 6న ఆత్మకూరు(ఎస్) మండలం కోటినాయక్‌తండా శివారులో ఓ వృద్ధురాలిని వీరు ఆటోలో ఎక్కించుకుని కొంతదూరం తీసుకెళ్లి ఆమెను బెదిరించి ఆమె మెడలోని వెండి గొలుసు లాక్కోని పారిపోయారు. బాధితురాలు ఈ నెల 10న ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం ఆత్మకూరు(ఎస్) మండలం ఎనుబాముల గ్రామ స్టేజీ వద్ద సీసీఎస్ ఇన్‌స్పెక్టర్, ఆత్మకూరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. వీరి నలుగురితో పాటు మరో బాలుడు ఆటోలో నెమ్మికల్ వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సూర్యాపేట జిల్లాలోని మునగాల, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, మేళ్లచెరువు, నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి, ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడినట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి 18 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, 3 ఆటోలు, ట్యాబ్, ల్యాప్‌టాప్, బైక్, టీవీ, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఫ 18 గ్రాముల బంగారం,
1.5 కేజీల వెండి, మూడు ఆటోలు, బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఫ వివరాలు వెల్లడించిన
సూర్యాపేట ఎస్పీ నరసింహ


