వృద్ధాప్యం.. ఉల్లాసం | - | Sakshi
Sakshi News home page

వృద్ధాప్యం.. ఉల్లాసం

Mar 15 2026 5:03 AM | Updated on Mar 15 2026 5:03 AM

ఫ వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రంలో సీనియర్‌ సిటిజన్‌ల ఆటవిడుపు

ఫ క్యారం, చెస్‌ ఆడుతూ కాలక్షేపం

నల్లగొండ టౌన్‌ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్‌ భవన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రం (ప్రణమ్‌ డే కేర్‌ సెంటర్‌) 60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్‌లకు ఆటవిడుపుగా మారింది. ఈ సెంటర్‌ను జనవరి 12న ప్రారంభించగా.. కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులే కాకుండా 60 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ ఈ సెంటర్‌లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సేద తీరవచ్చు. ఇంట్లో ఉండలేక ఇబ్బందులు పడే వయోవృద్ధులు ఈ కేంద్రానికి వచ్చి వార్తాపత్రికలు చదువుకోవడంతో పాటు క్యారం, చెస్‌ ఆటలు ఆడుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ యోగా, ఆరోగ్య శిబిరాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చే వయోవృద్ధులకు ఈ సెంటర్‌ నిర్వాహకులు ఉచితంగా టీ, స్నాక్స్‌ అందజేస్తారు. ప్రతిరోజు సుమారు 50 మంది వరకు వయోవృద్ధులు ఈ సెంటర్‌కు వచ్చి కాలక్షేపం చేయడంతో పాటు వివిధ ఆటలు ఆడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement