నల్లగొండ టూటౌన్ : చండూరులో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేయడం దుర్మార్గమని, మరోసారి దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు హెచ్చరించారు. బుధవారం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. చండూరులో మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన తమ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. మనోహర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజుయాదవ్ తదితరులు ఉన్నారు.
డ్రగ్స్‌పై సిట్‌తో ఒరిగేదేమీ లేదు
హైదరాబాద్ శివారులోని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. డ్రగ్స్ నిర్మూలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినవన్నీ ఉత్తమాటలే అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌కు డ్రగ్స్‌కు ఎలా వచ్చాయో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్రగ్స్ పార్టీలో నాయకులే పాల్గొనడటం బాధాకరమన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బ్రాహ్మణ సమాజంపై విషం కక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు


