రామగిరి(నల్లగొండ) : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రాక్టికల్ తరగతులు నల్లగొండ ఎన్జీ కాలేజీలో సోమవారం నుంచి ప్రారంభంకానున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్ తెలిపారు. ఐదో సెమిస్టర్ జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, బొటనీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ తరగతులు ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఒకటి, మూడో సెమిస్టర్ తరగతులు ఏప్రిల్ 17వ తేదీ వరకు జరుగుతాయన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కట్టంగూర్ : యువకులు దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన గుండు నాగరాజు(35)తో ఈ నెల 6న ఇద్దరు యువకులు ఘర్షణ పడి అతడి తలపై కర్రతో బలంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన నాగరాజును కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందాడు. ఆదివారం మృతుడి అన్న పరమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం. రవీందర్ తెలిపారు.


