చందంపేట : బైక్‌పై వెళ్తున్న యువకుడిని ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం వద్ద శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. నేరెడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన బుడిగపాక దశరథం(27) టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం రాత్రి నేరెడుగొమ్ము నుంచి దేవరకొండకు బైక్‌పై వస్తుండగా.. మార్గమధ్యలో తిమ్మాపురం సమీపంలో ఇసుక ట్రాక్టర్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దశరథం అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య బుడిగపాక అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపారు.
విద్యార్థినిని వేధిస్తున్న
రేడియోగ్రాఫర్ తొలగింపు
నల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శిక్షణ పొందుతున్న పారామెడికల్ విద్యార్థినిని వేధింపులకు గురిచేస్తున్న రేడియోగ్రాఫర్‌ను విధుల నుంచి తొలగించారు. సదరు విద్యార్థిని చేసిన ఫిర్యాదు మేరకు ఆస్పపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ కుమారి.. ఆర్‌ఎంఓతో కమిటీ వేసి విచారణ జరిపించారు. విచారణలో రేడియోగ్రాఫర్ విద్యార్థినిని వేధించినట్లు రుజువు కావడంతో అతడిని విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రేడియోగ్రాఫర్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు ఏజెన్సీ నిర్వాహకులు ఆదివారం తెలిపారు.
భారీగా నల్లబెల్లం,
పటిక పట్టివేత
దేవరకొండ : నాటుసారా తయారీకి వినియోగించే నల్లబెల్లం, పటికను నాగర్‌ర్నూల్ జిల్లాలోని చారకొండ నుంచి దేవరకొండకు ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తుండగా.. దేవరకొండ ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. మొత్తం 1800 కిలోల నల్లబెల్లం, 70 కిలోల పటికతో పాటు 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్లు సంతోష్, కిషన్ పర్యవేక్షణలో ఈ దాడులు జరిగాయని తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ అధికారులు శేఖర్‌రెడ్డి, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
పెన్‌పహాడ్ : అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఎస్‌ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో పొలిశెట్టి ఉపేంద్ర ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన నాలుగు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని ఆమైపె కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. పంచనామా చేసి బియ్యాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.


