రైతులకు ‘సహకార’ సేవలు
అందించాలి
నల్లగొండ : దేశాభివృద్ధి జనాభాపైనే ఆధారపడి ఉంటుందని.. జనగణన దేశానికి ఎంతో ముఖ్యమని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2027 జనగణనపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక ప్రాంత జనాభాను బట్టి నిధుల కేటాయింపు ఉంటుందన్నారు. జనగణన కోసం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు, హ్యాండ్ బుక్స్‌ను జాగ్రత్తగా చదువుకోవాలని సూచించారు. జనగణన రెండు విభాగాలుగా నిర్వహిస్తామని.. కుటుంబాలు, మనుషుల లెక్కలు సేకరిస్తామని తెలిపారు. 2027 జనగణన డిజిటల్ పద్ధతిలో జరుగుతుందన్నారు. జనగణనకు అవసరమైన టెక్నికల్ అసిస్టెంట్లు, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లను నియమించాలని ఆదేశించారు. రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ కార్యాలయ జాయింట్ డైరెక్టర్ రఘు మాట్లాడుతూ జనగణనలో సూపర్‌వైజర్, ఎన్యూమరేటర్లు, చార్జ్ ఆఫీసర్ల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓలు, కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పోషకాహారం అందించాలి
వసతిగృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన నల్లగొండలోని ఎస్‌ఎల్‌బీసీ మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ గదులను, వంట గదిని పరిశీలించారు. విద్యార్థులు భోజనం చేస్తుండగా వారి దగ్గరికి వెళ్లి నాణ్యతను పరిశీలించారు. వంట బాగుందా.. మెనూ అమలు చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సమీపంలో పాన్, గుట్కా షాపులు కనిపించడంతో పాఠశాలలకు వంద మీటర్ల పరిధిలో ఆ షాపులు లేకుండా చూడాలని డీఎస్పీకి సూచించారు.
నల్లగొండ టౌన్ : సహకార బ్యాంకు తమ సేవలను రైతులకు అందించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం నల్లగొండలోని సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో 2025–26 అర్ధవార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన బ్యాంకు పురోగతిని పరిశీలించి తగు సూచనలు చేశారు. నాబార్డ్ అందించే రుణ సదుపాయంతో రైతులు పండించే పంటలను నిల్వ ఉంచడానికి కోల్డ్ స్టోరేజ్, గోడౌన్స్ నిర్మించాలన్నారు. మహిళా సంఘాలకు అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత బ్యాంకుకు ఏర్పడిందన్నారు. బంగారం, ఇతర రుణాల సకాలంలో చెల్లించే విధంగా చూసుకోవాలని తెలిపారు. త్వరలో ప్రారంభం కాబోయే ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీసీఓ పత్యానాయక్, మురళిరమణ, ప్రవీణ్, సీఈఓ ఆర్.శంకర్‌రావు, జీఎం నర్మద ఉన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


