దేవరకొండ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం చందంపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ముత్యాల సర్వయ్య, కార్యకర్తలతో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు సకాలంలో రైతుబంధు జమచేయకుండా వారిని ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా, కరెంట్, సాగునీరు ఇవ్వడం లేదని మండిపడ్డారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికై న బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు టీవీఎన్ రెడ్డి, బిల్యానాయక్, కిషన్‌నాయక్, వడ్త్యా రమేష్, పల్లా ప్రవీణ్‌రెడ్డి, వల్లపురెడ్డి, గాజుల ఆంజ నేయులు, నీలా రవి తదితరులున్నారు.
ముత్యాల సర్వయ్యకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగదీష్‌రెడ్డి, పక్కన రవీంద్రకుమార్
ఫ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి


