సరిహద్దు దాటొస్తున్న | - | Sakshi
Sakshi News home page

సరిహద్దు దాటొస్తున్న

Mar 12 2026 7:44 AM | Updated on Mar 12 2026 7:44 AM

ఇసుక అక్రమంగా రవాణాపై చర్యలు తీసుకుంటాం

తూతూమంత్రంగా తనిఖీలు

ఇక్కడి ఓ ప్రజాప్రతినిధి అండతో యథేచ్ఛగా అక్రమ దందా

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇసుక.. అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో నుంచి దళారులు సరిహద్దులు దాటించి తెలంగాణలోకి ఇసుకను అక్రమంగా తరలిస్తూ భారీ దందాకు తెరలేపారు. ఈ అక్రమ రవాణా వెనుక ఓ కీలక ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన అండతోనే రాత్రి సమయాల్లో పరిమితికి మించి లోడ్‌తో లారీలు యథేచ్ఛగా సరిహద్దు దాటుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల వరుసగా పట్టుబడుతున్న లారీలే ఈ అక్రమ రవాణాకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అధికారులు నిఘా పెంచినా, రాజకీయ పలుకుబడి ముందు ఆ నిఘా నీరుగారిపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సరిహద్దులో నిఘా కరువు

ప్రధానంగా రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా లేకపోవడంతో ఈ అక్రమ రవాణా జోరుగా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. కృష్ణానది సరిహద్దు గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుక రవాణా సాగుతోంది. అక్రమ రవాణా చేస్తున్న లారీలను పట్టుకుంటున్నా నామమాత్రంగా కేసులను నమోదు చేసి వదిలేస్తున్నారే తప్ప నియంత్రించేందుకు చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

బుకింగ్‌ లేకుండానే సరఫరా

ఒక్కొక్క లారీలో 30టన్నులు, టిప్పర్‌లో 35టన్నుల ఇసుక పడుతుంది. కానీ వ్యాపారులు ఒక్కొక్క లారీలో 40 నుంచి 50టన్నులు, టిప్పర్‌లో 40 నుంచి 60 టన్నుల చొప్పున పరిమితికి మించి ఏపీ నుంచి ఇసుకను తరలిస్తున్నారు. మిర్యాలగూడలోని ఖాళీ స్థలాల్లో డంప్‌ చేసి అవసరమైన సమయంలో రెట్టింపు ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన ఇసుక వాహనం పేరిట ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ దానివల్ల చాలా రోజుల సమయం పడుతుండడంతో అవసరమైన వారు ఇసుక వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే రూ.3,970వేలకు వచ్చే ట్రాక్టర్‌ ఇసుక ఆఫ్‌లైన్‌లో మాత్రం రూ.5000 నుంచి రూ.7వేలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆంధ్రా ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందిస్తే పట్టుకోని కేసులను నమోదు చేస్తాం. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం.

– రాజశేఖర్‌రాజు, డీఎస్పీ, మిర్యాలగూడ

అధిక ఫీజులపై విద్యార్థుల ఆందోళన

ఫ ఏపీ నుంచి రాత్రి వేళ లారీల్లో

తరలించి మిర్యాలగూడలోని ఖాళీ ప్రదేశాల్లో డంప్‌

ఫ ఇక్కడ ట్రాక్టర్‌ ఇసుక

రూ.7 వేల వరకు విక్రయం

ఫ ఇటీవల ఆ ప్రజాప్రతినిధి లారీని వదిలేసిన పోలీసులు

మిర్యాలగూడ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో పోలీసులు, మైనింగ్‌, రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. రోజూ టన్నుల కొద్ది ఇసుక మిర్యాలగూడకు తరలివస్తున్నా అడపాదడపా తనిఖీలు చేస్తున్నారు. గత సంవత్సరం వంగమర్తి నుంచి మిర్యాలగూడకు వస్తున్న మూడు ఇసుక టిప్పర్లను రామచంద్రగూడెం వైజంక్షన్‌ వద్ద పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం హనుమాన్‌పేట వద్ద ఓ ఇసుక లారీని పట్టుకున్నారు. దానిపై పోలీసులు లోతుగా విచారణ చేయగా మిర్యాలగూడకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందిన ఐదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నాయని తెలియడంతో విస్తుపోయారు. ఆ ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు కేసు నమోదు చేయకుండానే ఆ లారీని వదిలేసినట్లు సమాచారం. గతంలో పట్టణ శివారులోని రైల్వేట్రాక్‌ వద్ద ఓ ఇసుక లారీని స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆ లారీ ఈనెల 22 వరకు పర్మిట్‌ పొంది ఉంది. కానీ అందులో ఇసుక మాత్రం 27టన్నులకుగాను 56టన్నులు ఉంది. ఓవర్‌ లోడ్‌ ఉండడంతో మిర్యాలగూడ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement