నల్లగొండ : ప్రత్యేక ప్రజావాణిలో 74 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలి పారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రజా వాణిలో ఆయన దివ్యాంగులు, వృద్ధుల నుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రత్యేక ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు సోమవారం నిర్వహించే ప్రజావాణికి వచ్చి ఇబ్బంది పడొద్దని.. వారి కోసం ప్రతి నెలా 4వ శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నామని.. ఇక్కడ వారి సమస్యలు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ నరసింహారావు నేత, అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


