నల్లగొండ : బైక్ షోరూమ్‌కు రూ.లక్షా75 వేలు జరిమానా విధిస్తూ నల్లగొండ వినియోగదారుల కమి షన్ తీర్పునిచ్చింది. చౌటుప్పల్‌కు చెందిన బొమ్మ మల్లేష్ 2023లో చౌటుప్పల్‌లోని హైటెక్ మోటార్స్‌లో హీరో గ్లామర్ బైక్ కొనుగోలు చేశాడు. బైక్ సరిగ్గా నడవకపోవడంతో షోరూమ్‌ను సంప్రదించాడు. నిర్వాహకులు స్పందించకపోవడంతో మల్లేష్ నల్లగొండ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి రూ.1.35 వేలు బైక్ ఖరీదు, రూ.30 వేలు జరిమానా, రూ.10 వేలు కోర్టు ఖర్చులు చెల్లించాలని శనివారం వినియోగదారుల కమిషన్ తీర్పునిచ్చింది. పరిహారాన్ని మొత్తం 9 శాతం వడ్డీతో చెల్లించాలని తీర్పులో పేర్కొంది.


