రిఫ్లెక్టీవ్‌ టేప్స్‌తో వాహన యజమానులపై భారం | - | Sakshi
Sakshi News home page

రిఫ్లెక్టీవ్‌ టేప్స్‌తో వాహన యజమానులపై భారం

Mar 27 2026 9:28 AM | Updated on Mar 27 2026 9:28 AM

రామగిరి(నల్లగొండ): ప్రైవేట్‌ ట్రావెల్‌ వాహనాలపై రిఫ్లెక్టీవ్‌ టేప్స్‌ తప్పనిసరి చేయడంతో వాహన యజమానులపై భారం పడుతుందని నల్లగొండ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఐతరాజు రమేష్‌ అన్నారు. ఈమేరకు గురువారం ట్రాన్స్‌పోర్ట్‌ అధికారిణి లావణ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఐతరాజు రమేష్‌ మాట్లాడుతూ.. ట్రావెల్స్‌ సరిగ్గా నడవకపోవడంతో వాహన యజమానులు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారని, కొత్తగా రిఫ్లెక్టీవ్‌ టేప్స్‌ తప్పనిసరి చేసి రూ.7 వేల వరకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం పెట్టిన నిబంధనతో వాహనాలను నడపలేమన్నారు. ప్రభుత్వం వెంటనే రిఫ్లెక్టివ్‌ టేప్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఏడుకొండలు, జానయ్య, శ్రీశైలం, నరేష్‌, లింగస్వామి, యాదగిరి, ప్రవీణ్‌, రమేష్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement