నల్లగొండ : రోడ్డు ప్రమాదాల నివారణపై సోమవారం నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో అరైవ్– అలైవ్ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఎస్పీ అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు రోడ్డు భద్రతపై సరైన మార్గనిర్ధేశం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగంపై పోలీస్ కళాబృందం, చిన్నారుల నృత్యం, యమధర్మరాజు వేషధారణతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు రాము, రాజశేఖర్‌రెడ్డి, మహాలక్ష్మయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
హెల్మెట్ వినియోగంపై చిన్నారులతో అవగాహన కల్పిస్తున్న పోలీసులు


