రామన్నపేట: మోదీ పాలనలో దేశ వ్యాప్తంగా వ్యవసాయరంగం నిర్వీర్యం అవుతోందని మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం జాతీయ నాయకుడు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. మంగళవారం రామన్నపేటలో నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం మహిళారైతుల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లో వ్యవసాయరంగాన్ని బందీగా చేయడానికి కేంద్రం కుటు పన్నుతోందన్నారు. పాలకులు విరుద్ధ విధానాలు అవలంబిస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. విత్తన సవరణ బిల్లు, విద్యుత్ సంస్కరణ బిల్లులు రైతులకు శాపంగా మారుతాయని హెచ్చరించారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్ మాట్లాడుతూ మహిళా రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. ఈ సమావేశంలో రైతుసంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, అరిబండి ప్రసాద్, బొంతల చంద్రారెడ్డి, కందాల ప్రమీల, మేక అశోక్‌రెడ్డి, మాటూరి బాలరాజు, బొంతు రాంబాబు, వీటి వెంకటేశ్వర్లు, చీరిక అలివేలు,శీలం ఫకీరమ్మ, గన్నెబోయిన విజయభాస్కర్, రంజిత, బూరుగు కృష్ణారెడ్డి, గన్నెబోయిన విజయభాస్కర్, బోయిని ఆనంద్, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, వనం ఉపేందర్, బల్గూరి అంజయ్య, కందుల హన్మంత్, గాదె నరేందర్ గంటెపాక శివ, పుట్టల ఉదయ్, మునుకుంట్ల లెనిన్, నాగటి ఉపేందర్, వేముల సైదులు, శానగొండ వెంకటేశ్వర్లు, మేడి ముకుంద, జంపాల అండాలు, బొడిగె రజిత, ఎర్ర సుమలత పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి


