కోదాడ : ప్రపంచంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బెంగళూరు నగరం కేంద్రంగా గ్రే కాప్స్, టీచర్ ట్రైబ్ సంస్థలు ఆన్‌లైన్‌లో నిర్వహించిన వరల్డ్ టీచర్స్ క్విజ్–26 విజేతగా కోదాడలోని తేజ విద్యాలయ ఉపాధ్యాయుడు ఉస్తేల ధనుష్‌రెడ్డి నిలిచినట్లు పాఠశాల నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 1 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో 11 వేల మంది పాల్గొనగా ఫైనల్‌కు నలుగురు ఎంపికయ్యారు. ఐదు రౌండ్లుగా జరిగిన ఫైనల్ పోటీలో ధనుష్‌రెడ్డి 500 మార్కులతో ప్రథమస్థానంలో నిలిచి రూ.20 వేల నగదు గెలుచుకున్నట్లు పేర్కొన్నారు. విజేతను పాఠశాల ప్రిన్సిపాల్ రమాసోమిరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.
నేటి నుంచి
చికెన్ వ్యాపారుల సమ్మె
నల్లగొండ టూటౌన్ : చికెన్ దుకాణాలకు కోళ్లను సరఫరా చేస్తున్న కార్పొరేట్ కంపెనీల తీరును ఖండిస్తూ చికెన్ వ్యాపారుల అసోసియేషన్ చేపడుతున్న సమ్మె జయప్రదం చేయాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 1వ తేదీ (బుధవారం) నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని చికెన్ దుకాణాలు మూసివేసి సమ్మె చేపడుతున్నట్లు పేర్కొన్నారు. చికెన్ దుకాణాల వ్యాపారాలు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న చికెన్ దుకాణాల యజమానులు దుకాణాలు మూసివేసి సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
బీజేపీ రాష్ట్ర కమిటీలో నలుగురికి చోటు
నల్లగొండ టూటౌన్ : బీజేపీ రాష్ట్ర కమిటీలో జిల్లా కేంద్రానికి చెందిన నలుగురికి చోటు దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా సీనియర్ నేత చింతా సాంబమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నూకల నరసింహారెడ్డి, పల్లెబోయిన శ్యాంసుందర్, మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌లను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.


