హెల్మెట్‌ ధరించకుంటే యమపురికే.. | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ ధరించకుంటే యమపురికే..

Apr 1 2026 7:24 AM | Updated on Apr 1 2026 7:24 AM

మిర్యాలగూడ అర్బన్‌ : రోడ్డు భద్రతపై పోలీస్‌ శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. మంగళవారం రాత్రి మిర్యాలగూడలోని రాజీవ్‌చౌక్‌ వద్ద పోలీస్‌ కళా బృందం సభ్యులతో యమధర్మరాజు, చిత్రగుప్తుడు, యమకింకరుల వేషాలు వేయించి వాహనదారులకు రోడ్డు భద్రతా, ప్రమాదాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్‌ ధరించకుండా వాహనం నడిపితే ప్రాణాపాయం తప్పదని సూచించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ కె.రాజశేఖరరాజు, సీఐలు నాగభూషణరావు, సోమనర్సయ్య, కరుణాకర్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌, వన్‌టౌన్‌, టూటౌన్‌ ఎస్‌ఐలు సైదిరెడ్డి, రాంబాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement