యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
వారబందీ లేకుండా నీటిని విడుదల చేయాలి
కోదాడరూరల్ : కోదాడ మండలంలో ఆర్‌కే మేజర్ పరిధిలోని ఆయకట్టు గ్రామాలైన దోరకుంట, కాపగల్లు, నల్లబండగూడెం, రెడ్లకుంటలో వరి పంటకు నీరు అందడం లేదని, వారబందీ లేకుండా నీటిని విడుదల చేయాలని రైతులు బుధవారం కాలువలోకి దిగి ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం వరి పైరుకు సరిపడినంత నీరు అందకపోతే ధాన్యం తాలుగా మారుతుందని రైతులు తెలిపారు. పంట కోతకు వచ్చేంత వరకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎంజీయూ లా కాలేజీ
ప్రిన్సిపాల్‌గా రవి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ లా కళాశాల ప్రిన్సిపాల్‌గా కామర్స్ అధ్యాపకుడు ఆకుల రవిని నియమిస్తూ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆకుల రవి నియామకం పట్ల యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.


