ఉచిత విద్యనందించేందుకే ‘పీపీటీ’ టెస్టు | - | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యనందించేందుకే ‘పీపీటీ’ టెస్టు

Mar 23 2026 9:07 AM | Updated on Mar 23 2026 9:07 AM

నల్లగొండ : చుక్కా రామయ్య మార్గదర్శకత్వంలో పీపుల్స్‌ ప్రోగ్రెస్‌ ట్రస్ట్‌ (పీపీటీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న ప్రగతి విద్యానికేతన్‌లో ఉచిత విద్యనందించేందుకు 6, 7 తరగతుల్లో ప్రవేశానికి టెస్టు నిర్వహిస్తున్నట్టు టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల్ల వెంకటేశం తెలిపారు. నల్లగొండలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఆదివారం పీపీటీ టెస్టుకు సంబంధించిన బుక్‌లెట్‌ను ఆయన విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి నిరుపేద కుటుంబాలకు చెందిన తెలివైన విద్యార్థులను ఈ టెస్టు ద్వారా ఎంపిక చేసి ప్రగతి విద్యానికేతన్‌ విద్యాలయంలో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, నలపరాజు వెంకన్న, కొమర్రాజు సైదులు, రవీందర్‌, పరీక్ష నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీజిల్లా కన్వీనర్‌గా శ్రీను

నకిరేకల్‌ : ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌గా నకిరేకల్‌ మండం చందంపల్లి గ్రా మానికి చెందిన యార శ్రీను నియామకమయ్యా రు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం జిల్లా కమిటీని ప్రకటించింది. జిల్లా కో కన్వీనర్‌గా ఎండీ యూసుఫ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిగా అద్దంకి రవీందర్‌, ట్రెజరర్‌గా కీర్తి అశోక్‌, జాయింట్‌ సెక్రటరీలుగా నందికంటి సైదులు, షేక్‌ ఖలీల్‌, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా సైఫ్‌, వెంకటరావ్‌, బాసాప్ప శ్రీనివాస్‌, యూత్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎసాం నాగరాజు, నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా ఎస్‌కే అన్సారీ(నల్లగొండ), టి.సలీంరాజు(దేవరకొండ), చేగొండి మహేందర్‌(నాగర్జునసాగర్‌), వెంకట సుబ్బయ్య(నాగర్జున సాగర్‌), యార శ్రీను (నకిరేకల్‌) దువ్వాడ నవీన్‌ (మునుగోడు), శ్రవణ్‌ (మునుగోడు కోఇన్‌చార్జి)ను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement