సాక్షి, యాదాద్రి: పార్టీ ఇచ్చిన పదవిని గౌరవంగా భావించి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని, కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ డీసీసీ కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలోని వివేరా హోటల్‌లో డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐల య్య అధ్యక్షతన డీసీసీ నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. పదవి వచ్చిన వారు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. పదవులు రానివారు నిరుత్సాహ పడొద్దని వారికి మరిన్ని అవకాశాలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరిని సమానంగా చూస్తుందన్నారు. బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకున్న మండలం, గ్రామ శాఖల పదవుల్లో కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు. మరికొందరికి నామినేటేడ్ పదవులు రానున్నాయన్నారు. పదవులు రాని వారు నిరాశ చెందొద్దన్నారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజల ఆదరణ పొందాలంటే నిరంతం వారి మధ్యన ఉండి పనిచేస్తే రెండోసారి గెలిచే అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్‌లు మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ముందుగా జాతీయపతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. కాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను, ఎమ్మెల్యేలను పలువురు నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు తంగెళ్లపల్లి వాణి రవికుమార్, బీజన బాలమణి భాస్కర్, కాంగ్రెస్ నాయకులు అండెం సంజీవరెడ్డి, పల్లె శ్రీనివాస్‌గౌడ్, పోత్నక్ ప్రమోద్‌కుమార్, జనగాం ఉపేందర్‌రెడ్డి, పోతంశెట్టి మంజుల, కసుబ శ్రీనివాసరావు, పులి అనిల్‌కుమార్, పిట్టల బాల్‌రాజ్, పోతంశెట్టి వెంకటేశ్, ఎడ్ల సత్తిరెడ్డి, సుర్వి వేణుగౌడ్, గోలి పింగల్‌రెడ్డి, కూర వెంకటేశ్ పాల్గొన్నారు.
అమెరికాకు వత్తాసు పలకడం తగదు
ఫ పదవులు రాని వారు నిరుత్సాహ పడొద్దు
ఫ కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుంది
ఫ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్


