ప్రజావాణిలో 105 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణిలో 105 ఫిర్యాదులు

Mar 17 2026 7:28 AM | Updated on Mar 17 2026 7:28 AM

నల్లగొండ : ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 105 ఫిర్యాదులు రాగా.. రెవెన్యూకు సంబంధించి 60, జిల్లా అధికారులకు 45 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రతి నెల చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తామని.. ఈనెల 28 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.

వంట గ్యాస్‌ ఇబ్బందులు తలెత్తొద్దు : కలెక్టర్‌

ప్రజావాణి అనంతరం కలెక్టర్‌ చంద్రశేఖర్‌ వివిధ శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. ప్రస్తుతం డొమెస్టిక్‌ సిలిండర్లు 21 రోజుల నుంచి 45 రోజుల్లోపు సరఫరా చేస్తున్నారని.. సిలిండర్లను బ్లాక్‌ చేయడం, డొమెస్టిక్‌ సిలిండర్లు వాణిజ్య పరంగా వినియోగించడం నేరమన్నారు. హాస్టళ్లు, పాఠశాలల్లో గ్యాస్‌ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ వారంలో సామూహిక ఇందిరమ్మ గృహప్రవేశాలకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తరఫున రంజాన్‌ తోఫాల పంపిణీ, ఇఫ్తార్‌కు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 22, 23 తేదీల తర్వాత యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ వై.అశోక్‌రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, అధికారులు పాల్గొన్నారు.

ఫ బాధితుల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement