గుర్రంపోడు : గుర్రంపోడు మండలంలోని పిట్టలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గుజ్జ వెంకట్‌రెడ్డి ఈ నెల 25వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరగుతున్న ఆలిండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీల్లో ఆయన పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపర్చి జాతీయ పోటీలకు ఎంపికై నట్లు నల్లగొండ జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి అక్బర్ అలీ తెలిపారు. వెంకట్‌రెడ్డిని ప్రధానోపాధ్యాయుడు కత్తి యాదగిరిరెడ్డి, ఉపాధ్యాయులు, వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు, తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సురేందర్‌రెడ్డి, బాలూనాయక్ అభినందించారు.
కల్మలచెరువు యువతి..
గరిడేపల్లి : మండలంలోని కల్మలచెరువు గ్రామానికి చెందిన మామిడి రజిత కూడా ఆలిండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు ఎంపికై ంది. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఆమె పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపింది. రజిత ప్రస్తుతం జనగామ జనరల్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఆమె చిన్నతనం నుంచి వాలీబాల్‌లో రాణిస్తోంది. రజితను గ్రామ పెద్దలు, స్నేహితులు అభినందించారు.
గుజ్జ వెంకట్‌రెడ్డి
మామిడి రజిత


