నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా బుధవారం రాత్రి ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భగుడిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈఓ మోహన్‌బాబు భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఐ విష్ణుమూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చూశారు. ఈ పూజల్లో అర్చకులు సతీష్‌శర్మ, సురేష్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ పాల్గొన్నారు.


