గృహ వినియోగదారులకు గ్యాస్‌ కొరత లేదు | - | Sakshi
Sakshi News home page

గృహ వినియోగదారులకు గ్యాస్‌ కొరత లేదు

Mar 13 2026 7:38 AM | Updated on Mar 13 2026 7:38 AM

నల్లగొండ : జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌లకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లో గ్యాస్‌ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో ఎల్పీజీ గ్యాస్‌ సరఫరాపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన మూడు రోజుల నుంచి కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాలో మాత్రమే కొరత ఉందన్నారు. నల్లగొండలో కొన్నిచోట్ల డొమెస్టిక్‌ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 16 మందిని గుర్తించి వారిపై నిత్యావసరాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గ్యాస్‌ బుక్‌ చేసుకునేందుకు ఇదివరకు 21 రోజుల సమయం ఉండేదని, దానిని ఇటీవల 45 రోజులకు మార్చడం జరిగిందన్నారు. గ్యాస్‌ సరఫరాకు సంబంధించి సమస్యలు ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన టోల్‌ ప్రీ అదనపు కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ వై.అశోక్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశం, గ్యాస్‌ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement